కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను తితిదే ప్రకటించింది. మార్చి 9న సర్వ ఏకాదశి, 11న మహాశివరాత్రి, 24 నుండి 28 వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనుంది.
మార్చి 24న స్మార్త ఏకాదశి, 25న వైష్ణవ మాధ్వ ఏకాదశి, 28న శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలను తితిదే జరపనుంది.