హనుమాన్ జన్మస్థలంపై ఏపీలోని తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ ప్రారంభమైంది. తిరుమలలోని అంజనాద్రి.. మారుతి జన్మస్థలంగా శ్రీ రామ నవమి రోజు తితిదే ప్రకటన చేసింది. కర్ణాటక హంపిలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.. ఈ ప్రకటనపై అభ్యంతరం చెప్పింది. ఇప్పటికే పలుమార్లు తితిదేకు లేఖలు రాసింది.
ఈ విషయంపై భేటీ అయ్యేందుకు తితిదే పండిత కమిటీ అంగీకరించింది. ఈ మేరకు.. నేడు తితిదే పండిత కమిటీ సభ్యులు, ఈవో ధర్మారెడ్డి, ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి సంవాదానికి హాజరయ్యారు. చర్చల అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.