ETV Bharat / city

కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ - tsrtc samme

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో ప్రజారవాణా దాదాపుగా నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలతో కాస్త ఊరట లభించినా... దాదాపుగా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన గడువును లెక్కచేయలేదు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసింది.

కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
author img

By

Published : Oct 5, 2019, 10:39 PM IST

కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అన్ని డిపోల్లోనూ కార్మికులు దాదాపుగా విధులకు హాజరు కాలేదు. భద్రత నడుమ అధికారులు అద్దె బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి నడిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని డిపోల వద్ద 144 సెక్షన్​ అమలులో ఉంచారు. ఆందోళనకు దిగిన కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.
శనివారం సాయంత్రం 6గంటల వరకు కార్మికులకు ప్రభుత్వ గడువు ఇచ్చింది. గడువులోపు మెుత్తం 160 మంది కార్మికులు విధుల్లో చేరారని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. హాజరైన వారిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు ఉన్నారని వెల్లడించింది,

ప్రయాణికులపై సమ్మె ప్రభావం

ప్రయాణికులపై ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎక్కువగా ప్రభావం చూపింది. బస్సుల కొరత కారణంగా వాహన దారులు అధిక ఛార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడింది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు రూ.300 ఛార్జీ ఉంటే రూ.600 వరకు వసూలు చేశారు. రెండు, మూడు రెట్ల రెట్టింపు ఛార్జీల వసూలుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం

ఎలాంటి గడువులకు బెదిరేదిలేదని... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఆదివారం ప్రతి బస్సు డిపో ఎదుట బతుకమ్మలతో నిరసనలు చేస్తామని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద 16 మందితో నిరాహారదీక్ష చేస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

అక్కడక్కడ గొడవలతో సాగిన సమ్మె

సమ్మె సందర్భంగా అక్కడక్కడ గొడవలు జరిగాయి. మహబూబాబాద్​లో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలేదని ఆర్టీసీ డ్రైవర్​ ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మాహత్యయత్నం చేశాడు. అక్కడక్కడ గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. కొన్ని చోట్ల కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు కండక్టర్లతో గొడవకు దిగారు.

ముగిసిన గడువు... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6గంటల్లోగా విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోను తిరిగి తీసుకోమని సర్కారు ఇంతకు ముందే వెల్లడించింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.