రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లినట్లు ఆర్టీసీ యూనియన్ నేత బీవీ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత... చర్చలకు పిలిచి డిమాండ్లపై చర్చించకుండానే సమ్మెను విరమించాలని కోరినట్లు ఆయన చెప్పారు. బీవీ రెడ్డితో సహా మరికొందరు ఆర్టీసీ కార్మిక నాయకులు గాంధీభవన్ వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలను కలిసి తాజా పరిస్థితులను వివరించారు. తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారుల వైఖరే కారణమని బీవీ రెడ్డి అన్నారు. ఆర్టీసీనే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ ఆరోపించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం