ఆర్టీసీ కార్మికుల నిరసనల్లో భాగంగా ఈనెల 9న టాంక్‌బండ్‌పై నిరనసలు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ ఐకాస. అందులో భాగంగా ఇవాళ విద్యానగర్‌లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించనున్న దీక్షలో పాల్గొనాల్సిందిగా ఓయూ విద్యార్థులకు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేయనుంది. అదేవిధంగా రేపటి దీక్షకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలపై ఆర్టీసీ నేతలు సమాలోచనలు చేయనున్నారు. విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో కూడా సమాలోచనలు చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'