ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ , అఖిలపక్ష నేతలు గన్‌పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మనసు మారి ఆర్టీసీ కార్మికుల పట్ల అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుకున్నట్లు ... మౌన దీక్ష అనంతరం అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఐకాస, అఖిలపక్ష నేతలు సుమారు గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా సీఎం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గన్‌పార్క్ వద్ద ఆర్టీసీ , అఖిలపక్ష నేతల మౌనదీక్ష - tsrtc strike at hyderabad
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ ఐకాస నేతలు మౌన దీక్ష చేపట్టారు. గన్‌పార్క్ వద్ద సుమారు గంట పాటు చేపట్టిన దీక్షలో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు.