ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. రేపు రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని వెల్లడించారు. రేపు అన్ని డిపోల వద్ద ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. ఈ నెల 23న ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. బంద్‌కు మద్దతు ప్రకటించిన అన్ని సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్