సెప్టెంబర్ నెల జీతాల చెల్లింపు కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. చేసిన పనికి జీతం చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ తరఫు న్యాయవాది వాదించగా.. జీతాల చెల్లింపునకు అవసరమైన డబ్బుల్లేవని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. జీతాల చెల్లింపునకు రూ.270 కోట్లు కావాల్సి ఉండగా.. తమ వద్ద రూ.7.3 కోట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. సమ్మె చట్ట విరుద్ధమని వాదించింది. జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపు కేసు విచారణ ఈనెల 29కి వాయిదా వేశారు.
జీతాల చెల్లింపునకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం
14:53 October 21
ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసు ఈనెల 29కి వాయిదా