ETV Bharat / city

రూ.7, రూ.57 ఇవి టికెట్ ధరలు కావు... ఆర్టీసీ కార్మికుల జీతాలు! - ఆర్టీసీ కార్మికులపై కరోనా ప్రభావం

ఆర్టీసీ ఉద్యోగుల‌కు మూడు నెల‌లుగా కేవ‌లం 50శాతం వేత‌నాలే ఇస్తున్నారు. జూన్ నెల‌లో పూర్తి వేతనం ఇస్తామ‌ని యాజ‌మాన్యం చెప్పడంతో సంతోషంలో మునిగిపోయిన కార్మికుల‌కు ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. యాజ‌మాన్యం ఇలా జీతం వేసింది.. అలా సంతోషం ఆవిరైంది. ఆ జీతం చూసిన కార్మికుల క‌ళ్లు బైర్లు క‌మ్మాయి. క‌న్నీళ్లు ఉబికి వ‌చ్చాయి. ఆ జీతాలతో ఎలా బతకడమని ఆందోళ‌న చెందుతున్నారు.

tsrtc
tsrtc
author img

By

Published : Jul 11, 2020, 6:41 PM IST

Updated : Jul 11, 2020, 7:31 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కండ‌క్టర్లు, డ్రైవ‌ర్లు, మెకానిక్‌లు, సూప‌ర్ వైజ‌ర్లు ఇలా అనేక ర‌కాల విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బ‌స్సులు పూర్తిస్థాయిలో న‌డ‌వ‌క‌పోవ‌డంతో ఉద్యోగులను పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోవ‌డం లేదు. ప‌నిచేసిన వారికి ప‌నిచేసిన రోజుల‌కే వేతనం చెల్లిస్తున్నారు. రూ.వందలోపు, రూ.వెయ్యి లోపు జీతం వ‌చ్చిన ఉద్యోగులూ ఉన్నారు. ఇక నాలుగు వేల నుంచి ఐదు వేల లోపు జీతం వ‌చ్చిన వారు ఎక్కువ శాతం ఉన్నారు. భ‌ద్రాచలం డిపోలో ఓ ఉద్యోగికి కేవ‌లం 77 రూపాయలు మాత్రమే వ‌చ్చింది. ఇదే డిపోలో మ‌రో ఉద్యోగికి రూ.999 మాత్రమే వ‌చ్చాయి. ఒక కార్మికుడికి కేవ‌లం రూ.57 మాత్రమే వ‌చ్చాయి. ఒక ఉద్యోగికి కేవలం 7 రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలా బతికేది

ఈ జీతాల‌తో తాము ఎలా బ‌త‌కాల‌ని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీటితో ఇంటి అద్దె ఎలా క‌ట్టాలి, నిత్యావ‌స‌ర స‌రుకులు ఎలా కొనుగోలు చేయాలి... ఇప్పుటికే పిల్లల‌కు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభ‌మ‌య్యాయి. పిల్లల పాఠ‌శాల ఫీజులు ఏవిధంగా క‌ట్టాలి... అని ఆర్టీసీ ఉద్యోగులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సులు మే 19నుంచి న‌డుస్తున్నాయి. సీట్ల నిండా ప్రయాణికుల‌ను ఎక్కించుకోవాల‌న్న నిబంధ‌న‌ల వ‌ల్ల క‌రోనా సోకే ప్రమాద‌మున్నా... ఆర్టీసీ సిబ్బంది త‌గు ర‌క్షణ చ‌ర్యలు తీసుకుని ప్రజ‌ల్లో సంస్థ ప‌ట్ల న‌మ్మకం క‌ల్గించేలా విధులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో డిపోల్లో డ్యూటీకీ రిపోర్టు చేసిన‌ప్పటికీ... డ్యూటీ దొర‌క‌ని సిబ్బందిని సెల‌వు తీసుకోమ‌ని చెప్తున్నార‌ని ఆర్టీసీ కార్మిక నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఆరోజు ఆబ్సెంట్‌గా మార్క్ వేస్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయంటున్నారు.

రిపోర్ట్ చేసినా ‌డ్యూటీలు దొరకడం లేదు

మే 19 నుంచి జూన్ 16 మ‌ధ్య కాలంలో 8 నుంచి 20 రోజులు డ్యూటీలు దొర‌క‌ని వారు ప్రతి డిపోలోనూ ఉన్నార‌ని ఆర్టీసీ యూనియ‌న్ నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అందులో కొంద‌రికి సెల‌వులు వేస్తూ.. మ‌రికొంద‌రికి ఆబ్సెంట్ వేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఫ‌లితంగా ఆర్టీసీ ఉద్యోగులు కొంద‌రు జీతం కోల్పోగా.. మ‌రికొంద‌రు సెల‌వులు కోల్పోతున్నార‌ని పేర్కొంటున్నారు. జులై 1న పూర్తి జీతం ఇచ్చినా... నాలుగు నుంచి ఐదు వేల జీతం కూడా రాక కార్మికులు అవ‌స్థలు ప‌డుతున్నార‌ని వాపోతున్నారు.

రిపోర్డు చేస్తే జీతం ఇవ్వాలి

కార్మికుడు డ్యూటీకీ రాకుంటే జీతం ఇవ్వక‌పోవ‌డం స‌మంజ‌స‌మే అయిన‌ప్పటికీ... యాజ‌మాన్యం కార్మికుల‌కు డ్యూటీ క‌ల్పించ‌క‌పోయిన‌ప్పుడు సెల‌వు, ఆబ్సెంట్ వేసి జీతం కోత విధించ‌డం స‌రైంది కాద‌ని కార్మిక‌నేత‌లు పేర్కొంటున్నారు. ఇక‌నైనా... రిపోర్టు చేసిన వారంద‌రికి హాజ‌రు వేయాల‌ని సెల‌వుల్లో, జీతంలో ఎటువంటి కోత విధించ‌వ‌ద్దని యాజ‌మాన్యానికి కార్మికులు, కార్మిక‌నేత‌లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి : ప్రగతి భవన్​కు చేరుకున్న సీఎం కేసీఆర్

Last Updated : Jul 11, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.