ETV Bharat / city

TSRTC: ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తెచ్చేలా వినూత్న ఆలోచన - తెలంగాణ ఆర్టీసీ వార్తలు

లాక్‌డౌన్ తర్వాత గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినప్పటికీ... ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించడంలేదు. గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు వినూత్న ఆలోచన చేశారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు... అన్ని డిపోల పరిధిలో ఆర్టీసీ కళాబృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ఆదరించండి... సౌకర్యవంతమైన ప్రయాణం చేయండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

TSRTC
TSRTC
author img

By

Published : Jul 18, 2021, 5:23 AM IST

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో... ఆదాయం రావడం లేదు. దీంతో నిర్వహణ మరింత భారంగా మారిపోతుంది. గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. రెండేళ్లక్రితం వరకు గ్రేటర్ పరధిలో 2,750 బస్సులు తిరిగేవి. ఆ సమయంలో సుమారు 30లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం కొనసాగించేవారు. ఈ సమయంలో 70శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియోను కొనసాగించేంది. కరోనా తర్వాత గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 1,700 బస్సులు తిప్పుతున్నారు. కానీ.. 400ల అద్దె బస్సులను మాత్రం.. తిప్పడంలేదు. ప్రస్తుతం ఓ.ఆర్ 42శాతం నుంచి 45శాతం ఆక్యుపెన్సీ రేషియో కొనసాగుతుంది. ప్రయాణికుల సంఖ్య కూడా 15 నుంచి 20లక్షల లోపుకి తగ్గిపోయింది.

ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తెచ్చేలా వినూత్న ఆలోచన

రోజుకు 15వేల ట్రిప్పులే..

కరోనాకు ముందు రోజుకి 30వేల ట్రిప్పులు తిరిగితే..ప్రస్తుతం అందులో సగం అంటే సుమారు 15వేల ట్రిప్పులను మాత్రమే తిప్పుతున్నారు. దీంతో ఆర్టీసీపై నిర్వహణ భారం పెరిగిపోయింది. గతంలో డీజీల్​పై రోజుకి రూ.లక్ష వరకు ఖర్చు చేసేవారు. ప్రస్తుతం రూ.లక్షా పదివేల వరకు ఖర్చు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఉద్యోగులకు, కార్మికులకు కలిపి నెలకు రూ.85కోట్లు కేవలం జీతాలకే వెచ్చించేవారు. ప్రస్తుతం అవి కూడా రావడంలేదని.. రోజురోజుకి డీజీల్ ధరలు పెరిగిపోతుండడంతో ఇది కూడా ఆర్టీసీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గాడిన పెట్టేందుకు..

గ్రేటర్​లో ఆర్టీసీని తిరిగి గాడినపెట్టేందుకు అధికారులు నడుము బిగించారు. ఆర్టీసీ బస్సులకు దూరమైన ప్రయాణికులకు తిరిగి చేరువయ్యేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేశారు. ఇప్పటికీ బస్సులు పూర్తిస్థాయిలో తిరడంలేదు. చాలా మంది డ్రైవర్లు, కండక్టర్లకు పనిలేకపోవడంతో..అందులో బాగా పాడగలిగేవారిని, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవారిని ఎంపికచేశారు. ఓ బస్సును తీసుకుని...దానికి పూర్తిగా ప్లెక్సీలను అంటించారు. గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో ఆర్టీసీ వల్ల కల్పిస్తున్న సౌకర్యాలను వాటిపై ప్రింట్ చేశారు.

ఆమె చేయి ఎత్తితే ఆపాల్సిందే..

కార్గో సేవలు, బస్ పాసులు, మహిళలకు రాత్రి 7:30 గంటల తర్వాత చెయ్యెత్తితే..బస్సు స్టాపు లేకపోయిన ఆపుతామని ప్రచారం చేస్తున్నారు. పిట్టలదొర వేషంతో పాటు.. పలువురు మహిళా కండక్టర్లు, డ్రైవర్లను, కండక్టర్లను ఎంపిక చేసి.. గ్రేటర్ పరిధిలోని 29 డిపోలలో ప్రదర్శనలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే.. జేబీఎస్ బస్టాండ్​లో కళాకారులతో ప్రదర్శన ఇచ్చారు. తర్వాత బోయిన్​పల్లి కూరగాయాల మార్కెట్ ముందు ప్రదర్శన చేశారు. ఇలా.. ప్రతిరోజూ ఒక్కో డిపోను ఎంచుకుని ఆ డిపో పరిధిలోని పలు ముఖ్యమైన ప్రదేశాల్లో కళాకారులచే ప్రదర్శనలు ఇస్తున్నారు.

ప్రయాణించండి.. ఆదరించండి..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అని కళాకారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను ఆర్టీసీ క్షేమంగా ఇంటికి చేరవేస్తుందని హామీనిస్తున్నారు. ఇన్నాళ్లు అనేకమంది నిరుద్యోగులను, ఉద్యోగులను, విద్యార్థులను, వ్యాపారులను ఆర్టీసీలో తీసుకెళ్లిందని.. ఇప్పుడు కూడా అలా అన్ని వర్గాల వారు తమ ఆర్టీసీలో ప్రయాణించి ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు.. మేము.. అందరం అనే నినాదంతో ముందుకెళుతున్నారు. ప్రతి రోజు ఆర్టీసీ బస్సును శానిటైజేషన్ చేస్తున్నామని.. ఆర్టీసీ ఉద్యోగులు ప్రదర్శనలో తెలియజేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని.. సామాన్య ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని..ఆర్టీసీలో ప్రయాణించడం ద్వారా డబ్బులు ఆదా చేసుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించిన వారు అవుతారని పేర్కొంటున్నారు.

ఇలా అయినా ప్రయాణికులు పెరుగుతారని..

ఆర్టీసీని మునుపటిలా ఆదరించండి... రక్షించండి అని కళాకారులు ప్రదర్శనల రూపంలో స్థానిక ప్రజలకు తెలియజేస్తున్నారు. కనీసం ఇలాగైనా ఆర్టీసీకి ప్రయాణికులు పెరుగుతారని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కళాకారుల ప్రదర్శనకు మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత కథనం: RTC: మహిళల భద్రతకు పెద్దపీట.. ఆ సమయం దాటితే ఆపాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.