ETV Bharat / city

ప్రైవేటుకు దీటుగా.. సేవలు సురక్షితంగా

author img

By

Published : Dec 20, 2019, 6:26 AM IST

Updated : Dec 20, 2019, 7:49 AM IST

జనవరి 1 నుంచి సరకు రవాణారంగంలో సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నష్టాల్లో ఉన్న సంస్థను  గట్టెక్కించేందుకు సరకు రవాణా రంగంలోకి దిగాలని... ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. దశల వారీగా అధికారులు సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. ఆర్టీసీలోనే ప్రయాణించాలని రవాణాశాఖ మంత్రి అజయ్‌ కుమార్  ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు.

ప్రైవేటుకు ధీటుగా.. సేవలు సురక్షితంగా
ప్రైవేటుకు ధీటుగా.. సేవలు సురక్షితంగా

సరకు రవాణాకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచి రవాణా చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు... సరకు రవాణా రంగంలోకి అడుగుపెట్టాలని డిసెంబర్ 1న జరిగిన ఆత్మీయ సమావేశంలో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దశలవారీగా డీవీఎంలు, డీఎంలతో ఉన్నతాధికారులు సమావేశమై తుది ప్రణాళికలు రూపొందించారు.

పాత బస్సులు...

ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వెయ్యి ఆర్టీసీ బస్సులను సరకు రవాణా బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో డిపోకు ఒకరు, రీజియన్‌కు ఒకరి చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లు, సూపర్ వైజర్లను నియమించాలని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆపరేటర్లు ఎలాంటి సరకులను, ఏ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు... కిలోకు ఎంత ఛార్జీ తీసుకుంటున్నారు వంటి అంశాలపై అధ్యయనం చేసి డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. కొన్ని మార్పులతో ఉన్నతాధికారులు తుది నివేదక రూపొందించారు.

ఎర్రబస్సులు..

సరకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వినియోగించాలని... డ్రైవర్లకు, సిబ్బందికి డ్రెస్ కోడ్ ఉండాలని ఈడీలతో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ అపరేటర్లకు దీటుగా పనిచేసేలా ప్రాణాళికలు సిద్ధం చేశారు. విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నందున కచ్చితంగా విజయం సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సురక్షిత ప్రయాణంతోపాటు సరైన సమయానికి చేర్చడంలో ఆర్టీసీకి మంచి పేరుంది. దాన్నే సరకు రవాణాకూ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రజాప్రతినిధులు అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ లేఖలు కూడా రాశారు. వచ్చే మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల్లో వనభోజనాలు చేయాలని మంత్రి నిర్ణయించారు.

ఇదీ చూడండి: లోకాయుక్తగా జస్టిస్‌ వెంకటరాములు.. హెచ్​ఆర్సీ ఛైర్మన్​గా జస్టిస్ చంద్రయ్య

Tg_hyd_63_19_rtc_starts_cargo_service_Pkg_3182388 Reporter : sripathi.srinivas Note: ఫైల్‌ విజువల్స్ వాడుకోగలరు. ( ) నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి ఆర్టీసీ సరుకు రవాణా రంగంలో అడుగుపెడుతుంది. 1వ తేదీ నుంచి సరుకు రవాణా బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడంలో భాగంగా ఆర్టీసీలో సరుకు రవాణా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ డిసెంబర్ 1వ తేదీన జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో అధికారులను ఆదేశించారు. ఈ దిశగా అధికారులు దశల వారీగా డివిఎంలు, డీఎంలతో విస్తృతమైన సమావేశాలు నిర్వహించారు....Look వాయిస్ ఓవర్ : గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన వెయ్యి బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో డిపోకు ఒకరు, ఒక్కో రిజియన్ కు ఒక్కొక్కరి చొప్పున సరుకు రవాణాకు సంభందించిన నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, సూపర్ వైజర్లను నియమించాలని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ స్పష్టం చేశారు. ప్రైవేట్ సరుకు రవాణా ఆపరేటర్ల వ్యాపారం ఎలా కొనసాగుతుంది, ఎటువంటి సరుకులను రవాణాకు వినియోగిస్తున్నారు, కిలోకు ఎంత తీసుకుంటున్నారు, ఏయే ప్రాంతాల్లో సరుకు రవాణా చేస్తున్నారు తదితర వివరాలను ఆర్టీసీ డిఎంలు డిపోల వారీగా వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంట్లో ఉన్నతాధికారులు కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది నిర్ణయానికి వచ్చారు. సరుకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వినియోగించాలని, సరుకు రవాణా లో పనిచేసే డ్రైవర్లకు, సిబ్బందికి డ్రెస్ కోడ్ ఉండాలని మంగళవారం ఈడిలతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కార్గో బస్సులు ఏవిధంగా రూపొందించాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రైవేట్ అపరేటర్లకు దీటుగా పనిచేసేలా ప్రాణాలికలు సిద్ధం చేశారు. ఆర్టీసీకి విస్తృతమైన నెట్ వర్క్ ఉన్నందున కచ్చితంగా సరుకు రవాణాలో అధికారులు విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికులను సరైన సమయంలో సురక్షితంగా చేర్చడంలో ఆర్టీసీకి మంచి పేరుంది...దాన్నే సరుకు రవాణా రంగంలో కొనసాగించాలని చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రజాప్రతినిధులు అందరూ ప్రయాణించాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. వచ్చే మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వన భోజనాలు చేయాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు.
Last Updated : Dec 20, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.