సహాయక సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన కోసం రాష్ట్రంలోనున్న ఇన్నోవేటర్లు, అంకురాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ దరఖాస్తులను ఆహ్వానించింది. త్వరలో నిర్వహించబోయే సహాయక సాంకేతిక సదస్సులో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది.
దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం టెక్నాలజీని ప్రదర్శించటంతో పాటు గుర్తించేందుకు దీనిని నిర్వహిస్తున్నట్లు టీఎస్ఐసీ ప్రకటించింది. నవంబర్ 14 వరకు దరఖాస్తులను తీసుకోనున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు!