పెట్రోలు ధర పెరిగిందని ఆందోళన వద్దని.. రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (tsrtc md vc sajjanar) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీ-24 పేరిట 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
కండక్టర్ల వద్ద టీ-24 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ టికెట్‌తో ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చన్నారు. విధుల్లో ఉండగా డ్రైవర్లు పాన్ మసాలాలు, గుట్కాలు తినకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు మరో ప్రకటనలో తెలిపారు.
ఇవీ చూడండి: