ETV Bharat / city

ఈ ఆర్థిక ఏడాదికి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం టార్గెట్ ఎంతంటే.? - ts government expects huge income from stamps and registration for 2022- 23

Stamps and Registration: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి భారీ ఆదాయాన్ని ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.15,600 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.12,364 కోట్లు రాబడి రాగా.. నెల నెలా వచ్చే రిజిస్ట్రేషన్ల రాబడి రెట్టింపు కావడంతో 25 శాతం అధికంగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

telangana stamps and registrations department
తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
author img

By

Published : Apr 15, 2022, 8:10 PM IST

Stamps and Registration: రాష్ట్రంలో కొవిడ్‌ కారణంగా ఈ ఆర్థిక ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాబడి రాలేదు. స్వల్పంగా రూ.136 కోట్లు ఆదాయం తగ్గి రూ.12,500 కోట్లకు బదులు... రూ.12,364 కోట్లు వచ్చింది. ఈ రాబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆల్‌ టైం రికార్డు. గతంలో ఎన్నడూ లేనంత అధికంగా వచ్చింది. 2021- 22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కొవిడ్‌ మూలంగా రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గినా... ఆ తర్వాత తొమ్మిది నెలల్లో ఆదాయం అనూహ్యంగా పెరిగింది.

కొవిడ్ ఎఫెక్ట్​: 2018- 19 ఆర్థిక ఏడాదిలో 15.2 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.6,612.74 కోట్లు ఆదాయం వచ్చింది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 16.59 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.7,061 కోట్లు రాబడి వచ్చింది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో 10వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే కొవిడ్‌ ప్రభావం అన్ని వ్యవస్థలపై పడటంతో రిజిస్ట్రేషన్ల శాఖపై కూడా తీవ్రంగా పడింది. దీంతో 2020- 21 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గి 12.11 లక్షలకు పడిపోయి తద్వారా కేవలం రూ.5,260.20 కోట్లు ఆదాయం వచ్చింది. అయినా ఈ ఆర్థిక సంవత్సరం 2021- 22లో రూ.12,500 కోట్లు రాబడి వస్తుందని అంచనాతో లక్ష్యంగా నిర్దేశించింది.

పుంజుకున్న రాబడులు: రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడంతోపాటు... వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచడంతో నెలకు ఆరేడు వందల కోట్లు రాబడి వచ్చేది కాస్త ఏకంగా రెట్టింపునకు ఆదాయం పెరిగింది. మొదటి మూడు నెలలు ఆదాయం పడిపోయినా ఆ తరువాత నెలకు సగటున 1000 కోట్లకు తక్కువ లేకుండా రూ.1,501 కోట్ల వరకు రాబడి వచ్చింది. దీంతో 19.87 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన లక్ష్యానికి దాదాపు చేరుకుంది.

రెట్టింపు జరగాలి: 2022- 23 ఆర్థిక ఏడాదిలో ఈ ఆర్థిక ఏడాది కంటే 25 శాతం ఎక్కువగా రాబడి వస్తుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు రూ.15,600 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. అంటే ప్రతి నెలా సగటున రూ.1300 కోట్లకు తక్కువ లేకుండా రాబడి వస్తేనే నిర్దేశించిన లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య కంటే రెట్టింపునకు మించి జరగాల్సి ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: లక్ష్మణ్​

4 రోజులు తాపీ పని.. 3 రోజులు కాలేజీ.. ఎంఏ ఇంగ్లిష్​లో 2 గోల్డ్​ మెడల్స్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.