ETV Bharat / city

EAMCET COUNSELLING: ఎట్టకేలకు ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ - telangana education news

ఇంజినీరింగ్ తుది విడత సీట్ల భర్తీకి ఎట్టకేలకు కౌన్సెలింగ్ షెడ్యూల్​ విడుదలయింది. ఈనెల 6 నుంచి తుది విడత.. ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కోర్సుల్లో తాజాగా 5,610 సీట్లకు అనుమతినిచ్చింది. కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు తుది విడత కౌన్సెలింగ్ సుమారు 4,200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

EAMCET COUNSELLING
EAMCET COUNSELLING
author img

By

Published : Nov 3, 2021, 5:16 AM IST

ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఈనెల 6 నుంచి తుది విడత కౌన్సెలింగ్ (TS EAMCET COUNSELLING SCHEDULE )ప్రారంభం కానుంది. మొదటి విడతలో వచ్చిన సీటు రద్దు చేసుకునే గడువును ఈనెల 5 వరకు పొడిగించారు. ధ్రువపత్రాల పరిశీల కోసం ఈ నెల 6, 7 తేదీల్లో ఆన్​లైన్​లో రుసుము చెల్లించి స్లాట్​ బుకింగ్​ చేసుకోవాలి. ఈనెల 8న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 12న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

అక్కడ ప్రవేశాలు కొలిక్కి వచ్చాక..

తుది విడతలో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 18 వరకు అవకాశం ఉంటుంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు కొలిక్కి వచ్చాక.. ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ (TS EAMCET COUNSELLING SCHEDULE )నిర్వహిస్తారు. ఈనెల 20, 21 తేదీల్లో వెబ్​ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 24న సీట్లను కేటాయిస్తారు. ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్​సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండ్​లో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలు.. మిగతా అభ్యర్థులు 10 వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.

హైకోర్టు ఆదేశాలతో..

ఇంజినీరింగ్​లో కొత్త కోర్సుల్లో సుమారు 6 వేల సీట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ కాలేజీల్లో 5,610 సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాటిలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,200 సీట్లు తుది, ప్రత్యేక విడతల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు.

ఇదీచూడండి: Etela Rajender Harish rao News: ఒక ఎన్నిక స్నేహాన్ని విడదీసింది... మాటల తూటాలు పేల్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.