ETV Bharat / city

'వ్యవసాయంపై నియంత్రిత విధానం రావాలి' - telangana taza news

ts cm kcr reviewed on agriculture department with officials
వ్యవసాయశాఖపై ముగిసిన సీఎం సమీక్ష
author img

By

Published : May 10, 2020, 9:05 PM IST

Updated : May 11, 2020, 12:02 AM IST

21:04 May 10

'వ్యవసాయంపై నియంత్రిత విధానం రావాలి'

 రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారాలంటే.. పంటల సాగుపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల అవసరాలకు తగినట్లు సాగుచేసేలా సర్కారు సూచనలు చేయాలని సలహా ఇచ్చారు. రైతులు ఎవరికి ఇష్టమెచ్చినట్లు వారు పంటలు పండించకుండా.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు తీసుకోవాలన్నారు. సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, నియంత్రిత సాగు విధానం, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడం వంటి అంశాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష జరిగింది.  

లాభసాటి సాగుపై సమాలోచనలు

          రాష్ట్రంలో సాగు లాభసాటిగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యలను వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్​లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట పండించాలనే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని, దానికి అనుగుణంగా సాగుచేసేట్లు చూడడం అత్యంత ప్రధానమని వారు స్పష్టం చేశారు.  

రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ప్రస్తుతం ఉందని, అలా చేయడం వల్ల పండించిన పంటకు మంచి ధర రాదన్నారు. మార్కెట్ డిమాండ్​ ఆధారంగా పంటలు పండించాలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచించారు. సాగు పూర్తిగా నియంత్రిత విధానంలోకి రావాలని, దీనిపై రైతుల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. వ్యవసాయాధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం, పరిశోధన చేసి ఎక్కడ ఏ పంట ఎంత మేర సాగు చేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని నిలిపివేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలను ఉల్లంఘించి సాగుచేసిన వారి పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు.  

మార్కెట్​ డిమాండ్​కు అనుగుణంగానే..

ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలని పేర్కొన్నారు. ఈసారి కరోనా- లాక్​డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోందన్నారు. ఏటా కొనుగోలు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదని పేర్కొంది. ఇందువల్ల మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరోమార్గం లేదని వారు అభిప్రాయపడ్డారు.  

             రాష్ట్రప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలనే విషయంలో ఇప్పటికే కొంత నిర్ధరణకు వచ్చారు.  

ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 80-90 లక్షల ఎకరాలు, పత్తి 50 లక్షల ఎకరాలు, కంది 10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 7 లక్షల ఎకరాలు, వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాలు, మిర్చి రెండున్నర లక్షల ఎకరాలు, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాలు, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాలు, పసుపు 1.25 లక్షల ఎకరాలు, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు పంటలు మరో రెండు లక్షల ఎకరాలు, కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం ఉత్తమమని లెక్కలు వెల్లడించారు.

పామాయిల్​ సాగుపై..

 ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడమే కాకుండా.. 30-40 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్ సాగును తెలంగాణలో విస్తరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారని మార్కెట్లో దీని డిమాండ్ అధికంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్ సాగును విస్తరించొచ్చని పేర్కొన్నారు.  

            రాష్ట్రంలో 80-90 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అందులోనూ మార్కెట్ అవసరాలకు తగిన పంటలు పండించాల్సి ఉందని స్పష్టంచేశారు. సన్న రకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలన్నారు. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతి చేయాల్సి ఉంటుందని.. వారికోసం దొడ్డు రకాలు పండించాలని సూచించారు.  

తెలంగాణ సోనా..  

 తెలంగాణ ప్రజలు ఎక్కువగా సన్నరకాలు తింటారని, స్థానిక అవసరాల కోసం వాటినీ పండించాలని పేర్కొన్నారు. బియ్యం గింజ పొడవు 6.2 మీ.మీ అంతకన్నా ఎక్కువ ఉన్నరకాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉంటుందని సూచించారు. తదనుగుణంగా ఆయా రకాలనూ పండించాల్సి ఉంటుందన్నారు. ఏది ఎంత పండించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని, అందుకు వీలుగా సాగు చేయాలన్నారు. తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివని వీటిని షుగర్ ఫ్రీ రైస్‌గా వ్యవసాయ రంగ నిపుణులు గుర్తించారన్నారు.  

బ్రాండ్​ ఇమేజ్​..

           తెలంగాణ సోనా రకం బియ్యంలో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్ జర్నల్స్ కూడా ప్రచురించాయి. తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్ ఇమేజి ఉన్నందున ఈ రకాన్ని వర్షాకాలం సీజన్‌లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలని సూచించారు. ఇందుకు కావాల్సిన విత్తనాలను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.  

నిపుణుల కమిటీ

ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలన్నారు. విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను.. రైతులకు అంటగట్టే పద్ధతికి స్వస్తి చెప్పాల్సి ఉందన్నారు. ఈ విషయంలోను పూర్తిస్థాయి నియంత్రణ రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్​రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్​రావు, సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ సీమా, అగ్రి బిజినెస్ నిపుణులు రాధిక, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. 

ఇవీచూడండి: మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!

Last Updated : May 11, 2020, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.