చింతపండు..
వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పప్పు, పులిహోర, చారులో వాడుతుంటారు. ఆహారం త్వరగా పాడవకుండా ఉంచుతుంది. ఇప్పుడు చింతపండే కాదు దాని ధరలూ పుల్లగానే ఉన్నాయి. కిలో రూ.250 వరకు ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా వంటల్లో రుచికోసం నిమ్మకాయ ఉపయోగించుకోవచ్ఛు ప్రస్తుతం వీటి ధరలు తక్కువే ఉన్నాయి. మామిడిపొడి (ఆమ్‌చూర్ పౌడర్) వాడుకోవచ్ఛు ఉత్తరాదిలో చింతపండు వాడరు. అక్కడ పులుపు కోసం నిమ్మకాయ, దప్పకాయలు ఉపయోగిస్తారు. పులుపు కోసం సీజన్‌లో దొరికే చింతకాయలు, మామిడికాయలు, మామిడిపొడి, ఉసిరికాయగుజ్జు వాడుకోవచ్ఛు
ఉల్లిగడ్ఢ..
ఉల్లిని కూరల్లో రుచికి ఉపయోగిస్తుంటారు. వంటకాల్లో పులుసు కోసం వాడతారు. దీనికి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని ఉపయోగించవచ్ఛు మూతపెట్టకుండా ఉడికించి వాడుకోవాలి. పూర్తిగా క్యాబేజీ కాకుండా కొంత ఉల్లిపాయ కూడా ఉంటే మంచిది. వంటల్లో గ్రేవీ కోసం ఆనపకాయను వాడొచ్ఛు భవిష్యత్తు కోసమైతే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేసుకుని ఉల్లిపొడి చేసుకోవచ్ఛు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్ఛు.
టమాటా
ప్రత్యామ్నాయంగా చింతకాయలు ఉడికించి గుజ్జుతీసి పులుపుగా వాడుకోవచ్ఛు మొన్నటివరకు ధరలు ఎక్కువున్నా.. ప్రస్తుతం తగ్గాయి. ధరలు పెరిగినప్పుడు ఉసిరి గుజ్జు తీసి వాడుకోవచ్ఛు దప్పకాయలను టమాట బదులుగా వంటల్లో వాడొచ్ఛు.
ఎన్నోరకాల పప్పులు
మార్కెట్లో ఎన్నో పప్పులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు ఒకే విధమైన మాంసకృతులు లభ్యమవుతున్నాయి. మాంసం తినని వారికి ఎక్కువగా పప్పుల్లోనే లభ్యమవుతాయి. కాబట్టి తక్కువ ధరలో పప్పులను తీసుకోవచ్ఛు ఎర్రపప్పు తక్కువలో వస్తుంది. దీన్ని కూడా రుచికరంగా వండుకోవచ్ఛు శరీరానికి అవసరమైన పోషకాల కోసం కందిపప్పే కాకుండా శనగలు, బొబ్బర్లు, పెసళ్లు, చిక్కుడు, ఉలువలు కూడా ఉపయోగించొచ్ఛు కొన్ని గుగ్గిళ్లుగా, మరికొన్నింటిని పప్పుగా తినొచ్ఛు అలసంద తీసుకోవచ్ఛు పీచు ఎక్కువగా ఉండే ఈ పదార్థాలు ఊబకాయం, కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి మేలు చేస్తాయి. దాల్ అనలాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మాంసకృతులు వీటిలో సంవృద్ధిగా ఉంటాయి.