ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎండీని కలిసిన టీఆర్‌వీకేఎస్‌ నేతలు

హైదరాబాద్ విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ జాన్సన్, కోడూరు ప్రకాశ్‌లు కలిశారు. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టిజన్ సమస్యలు, తదితర అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్
హైదరాబాద్
author img

By

Published : Sep 16, 2022, 7:45 PM IST

Updated : Sep 16, 2022, 8:53 PM IST

హైదరాబాద్ విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ జాన్సన్, కోడూరు ప్రకాశ్‌లు కలిశారు. ఈ నెల 7న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి.. సరఫరాలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులందరినీ సీఎండీ ప్రభాకర్‌రావు అభినందించారు. ఈ విజయం మనందరి సమష్టి విజయమని ఆయన అన్నారు.

ఈ క్రమంలోనే విద్యుత్ ఉద్యోగులు సీఎండీ ప్రభాకర్‌రావును సన్మానించారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్, ఆర్టిజన్ సమస్యలు, ఎన్పీడీసీఎల్ ప్రమోషన్​ల గురించి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభాకర్‌రావు.. పీఆర్సీ అమలులో భాగంగా ఈ నెలాఖరులో అన్ని విద్యుత్ సంఘాల వారిని చర్చలకు పిలుస్తామని చెప్పారు. అప్పుడే ఈపీఎఫ్‌, ఆర్టిజన్‌ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ప్రమోషన్లు అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీకి త్వరలోనే ఉత్తరం రాస్తామని ప్రభాకర్‌రావు వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, జెన్‌కో కార్యదర్శి చారుగుండ్ల రమేశ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ కమలాకర్ రావు, శ్రీధర్ గౌడ్, రాష్ట్ర అదనపు కార్యదర్శి నిరంజన్, ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎండీ యూసఫ్, కార్యదర్శి కరెంటురావు, తెలంగాణ ట్రాన్స్‌కో కంపెనీ కార్యదర్శి రాములు, నాయకులు రజినీకాంత్, నరేంద్ర పాల్, విశాల్, నవీన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత

డ్యాన్సింగ్​ పోలీస్.. స్టెప్​ వేస్తే క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్

Last Updated : Sep 16, 2022, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.