TRSLP meeting Traffic restrictions in Banjara Hills: తెరాస కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నేతలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు హాజరవుతుండటంతో....ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసు సంయుక్త కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 మీదుగా వాహనదారుల రాకపోకలు నిలిపివేయనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్, అపోలో ఆసుపత్రి, ఫిలింనగర్ నుంచి వచ్చే వాహనాలను... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, 36 మీదుగా మళ్లించనున్నారు. మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు వచ్చే వాహనాలను... రోడ్ నెంబర్ 1,10 మీదుగా జహీర్‌నగర్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదగా మళ్లిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సంయుక్త సీపీ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సంయుక్త సీపీ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: