ETV Bharat / city

గ్రేటర్​లో గెలుపు మాదే.. రెండో స్థానం ఎంఐఎందే: కేటీఆర్​ - భాజపాపై కేటీఆర్​ మండిపాటు

గ్రేటర్​ ఎన్నికల్లో తమకు మజ్లిస్​తోనే పోటీ అని కేటీఆర్​ అన్నారు. మొదటి స్థానం తెరాస, రెండో స్థానం ఎంఐఎం దక్కించుకుంటాయని జోస్యం చెప్పారు. భాజపా నాయకులు గ్లోబెల్స్ ప్రచారానికి కజిన్ బ్రదర్స్​లా మారారని ఎద్దేవా చేశారు.

trs working president ktr comments on trs-mim alliance in ghmc elections
గ్రేటర్​లో గెలుపు మాదే.. రెండో స్థానం ఎంఐఎందే: కేటీఆర్​
author img

By

Published : Nov 24, 2020, 12:32 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీదారు ఎంఐఎం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. మొదటి స్థానంలో తెరాస ఉంటే... రెండో స్థానం మజ్లిస్​దేనని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో తమకు లేని పొత్తును భాజపా నాయకులు అంటగడుతున్నారని మండిపడ్డారు. గ్లోబెల్స్ ప్రచారానికి కజిన్ బ్రదర్స్​​లా మారారని ఎద్దేవా చేశారు. అసత్య ఆరోపణలు, అర్ధసత్యాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలోని ముస్లింలపై భాజపాకు ఎంత విద్వేషం ఉందో తెలుస్తోందని కేటీఆర్​ అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేసిన ఛార్జి​షీట్​కు... 'తెరాస-ఎంఐఎం సర్కార్​ వైఫల్యాలు' అనే పేరు పెట్టడం చూస్తే వారికున్న పరిజ్ఞానం ఏపాటిదో తెలుస్తోందని విమర్శించారు.

గ్రేటర్​లో గెలుపు మాదే.. రెండో స్థానం ఎంఐఎందే: కేటీఆర్​

ఇదీ చూడండి: సూటిగా అడుగుతున్నా.. సుత్తిలేకుండా చెప్పండి : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.