ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిల్మ్‌నగర్ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కేంద్రం నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని మల్లారెడ్డి మండిపడ్డారు.
మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. భాజపా నేతృత్వంలోని సర్కార్ పేదలపై పన్నుభారం మోపుతోందని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో మోదీ హఠావో దేశ్ బచావో అంటూ పాల డబ్బాలతో గులాబీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పాలు, పెరుగుపై జీఎస్టీ విధించడంపై జగిత్యాలలో తహసిల్ చౌరస్తా వద్ద తెరాస శ్రేణులు ధర్నా నిర్వహించాయి. చేతిలో పాల ప్యాకెట్లను పట్టుకుని తెరాస కార్యకర్తలు మెట్‌పల్లిలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. జీఎస్టీ భారం తగ్గించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గులాబీ పార్టీ శ్రేణులు నినదించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండల కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు కొనసాగాయి.
ఇవీ చూడండి: