ETV Bharat / city

TRS Ministers Protest at Begumpet : 'మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు విశ్రమించం'

TRS Ministers Protest at Begumpet : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ ధర్నాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చమురు ధరలు పెంచి వాహనదారులను.. వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో భాజపా సర్కార్‌ను గద్దె దించే వరకు విశ్రమించమని అన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయకుండా మోదీ సర్కార్‌ రైతులను అవస్థలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS Ministers About BJP
TRS Ministers About BJP
author img

By

Published : Mar 24, 2022, 12:52 PM IST

మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు విశ్రమించం

TRS Ministers Protest at Begumpet : కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంటలను కొనుగోలు చేయబోమంటోందని తెలిపారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS Protest over Fuel Prices Hike : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు నిరసిస్తూ.. తెరాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని చీఫ్ రేషనింగ్ ఆఫీస్‌ ఎదుట రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పెంచిన చమురు ధరలు వాహనదారులకు భారంగా మారాయని.. తక్షణమే రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

TRS Dharna in Hyderabad : "కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గద్దె దించే వరకు విశ్రమించం. కేంద్రానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే కొవిడ్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగాలు.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. స్వరాష్ట్ర సాధన తర్వాత కేవలం ఎనిమిదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 24 గంటల విద్యుత్, సురక్షిత తాగు నీరు, కల్యాణ లక్ష్మి వంటి 150 కార్యక్రమాలు అమలు చేస్తున్నాం."

- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి

TRS Protest Against Modi : రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతులు ఆందోళనగా ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పంజాబ్‌ తరహాలో తెలంగాణలోనూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో ధర్నాలు చేయలేదన్న కవిత.. ఆ అవసరం వస్తుందని అనుకోలేదని చెప్పారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు.

"2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంది. ఇప్పుడు రూ.1050. అప్పుడు లీటరు పెట్రోల్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.109కు పెరిగింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు నిరంతరం ప్రశ్నించాలి. తెలంగాణ భాజపా నాయకులు కేంద్రంపై పోరాటం చేయాలి. లేకపోతే ప్రజలంతా భాజపా హటావో.. దేశ్ కో బచావో అంటూ నినదిస్తారు."

- కవిత, ఎమ్మెల్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.