ETV Bharat / city

ఈనెల 6న 'సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డల రాఖీ' కార్యక్రమం

KTR about Women's Day : ఆడవాళ్లకు ప్రత్యేక గౌరవం.. పడతుల ప్రగతికి అత్యంత ప్రాధాన్యమిచ్చే తెరాస పార్టీ.. ఈ మహిళా దినోత్సవానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.. గులాబీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ఆడబిడ్డల కోసం ఈనెల 6, 7, 8న సంబురాలు జరపాలని ఆదేశించారు.

KTR about Women's Day
KTR about Women's Day
author img

By

Published : Mar 3, 2022, 1:27 PM IST

KTR about Women's Day : మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెరాస నేతలకు పిలుపునిచ్చారు. తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. మహిళాబంధు కేసీఆర్ పేరిట.. ఈనెల 6, 7, 8న సంబురాలు జరపాలని ఆదేశించారు. ఈ నెల 6న కేసీఆర్‌కు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

TRS Party Celebrates Women's Day : పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, ఏఎన్ఎంలు, విద్యార్థినులు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను సన్మానించాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారాలతో మానవహారాలు జరపాలన్నారు. ఈనెల 7న కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని చెప్పారు. ఈనెల 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో భేటీలు జరిపి సంబురాలు నిర్వహించాలని తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.