ETV Bharat / city

గ్రేటర్​పై మరోసారి జెండా ఎగరేసేందుకు గులాబీ నేతల కసరత్తు

author img

By

Published : Nov 14, 2020, 4:42 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో మరోసారి తమ సత్తా చాటేందుకు తెరాస నేతలు కసరత్తు ప్రారంభించారు. పలువురు మంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు బాధ్యత వహించబోతున్నారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

trs party exercise for GHMC elections
గ్రేటర్​పై మరోసారి జెండా ఎగరేసేందుకు గులాబీ నేతల కసరత్తు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలువురు మంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు బాధ్యత వహించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్​లోని తన నివాసంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఒక్కో డివిజన్​కు ఒక్కో ఎమ్మెల్యే...

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒక్కో డివిజన్​కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేను ఎన్నికల బాధ్యులుగా నియమించి ప్రచారం నిర్వహిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

ప్రచారం వ్యూహంపై సమాలోచనలు...

ప్రస్తుతం స్థానిక పరిస్థితులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రి వేములకు వివరించారు. ఏయే ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందో సమాలోచనలు చేశారు. ఈ విషయాలన్నీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: దీపావళికి కేసీఆర్‌ కానుకగా ఆస్తిపన్నులో రాయితీ : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.