ETV Bharat / city

తెలంగాణ సాధనతో పనిపూర్తికాలేదు: ఎంపీ కేకే - trs formation day news

తెరాస ఆవిర్భవించి నేటికి 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. తెలంగాణ భవన్​లో ఆ పార్టీ సెక్రటరీ జనరల్​, ఎంపీ కే.కేశవరావు గులాబీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని.. బంగారు తెలంగాణగా రూపుదిద్దడమే తమ లక్ష్యమన్నారు.

trs formation day
trs formation day
author img

By

Published : Apr 27, 2021, 10:47 AM IST

Updated : Apr 27, 2021, 11:37 AM IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కన్న కలలను.. సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని.. తెరాస సెక్రటరీ జనరల్, ఎంపీ ​కే.కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినమన్నారు.

తెరాస ఆవిర్భవించి నేటికి 20 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కేకే పూలమాల వేశారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ కల సాకారమైందని కేకే అన్నారు. రాష్ట్ర సాధనతో పని పూర్తి కాలేదన్న ఆయన.. బంగారు తెలంగాణగా రూపు దిద్దడమే తమ లక్ష్యమన్నారు. కోటి ఎకరాల మాగాణి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. కొవిడ్​ ఉద్ధృతి కారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలిపారు.

తెరాస ఆవిర్భావ వేడుకలు

ఇవీచూడండి: రాష్ట్రంపై కరోనా పంజా.. ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు

Last Updated : Apr 27, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.