మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే శిక్షించేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని.. తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు. దిశ హత్యాచార ఘటనపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆడవారిపై దారుణాలకు ఒడిగడుతున్న తరుణంలో కీచకులను కఠినంగా శిక్షించేలా చట్టాల్లో మార్పులు తేవాలని, దీనిపై రాజ్యసభలో సమగ్ర చర్చ జరపాలని కోరారు.
ఇవీచూడండి: 'దిశ' హత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం