వందల ఎకరాల భూమి కబ్జా చేశానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బడుగువర్గాల వారిని ప్రోత్సహించి పదవి ఇస్తే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఇదీ చూడండి : గావ్ కనెక్షన్ నివేదికలో అన్నదాత ఆవేదన!