ETV Bharat / city

'కేటీఆర్​ కాళ్లు పట్టుకుంటే.. మీకే సిగ్గుచేటు'

author img

By

Published : Feb 4, 2020, 5:30 PM IST

మంత్రి కేటీఆర్​.. కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకుంటే మీకే సిగ్గుచేటని, లక్ష్మణ్​పై ప్రభుత్వ విప్​ భానుప్రసాద్​ మండిపడ్డారు. భాజపా నేతలకు ప్రజాప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు.

TRS MLC BHANU PRASAD FIRES ON BJP STATE PRESIDENT LAXMAN
కేటీఆర్​ కాళ్లు పట్టుకుంటే.. మీకే సిగ్గుచేటు: లక్ష్మణ్​

కేటీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ భానుప్రసాద్‌ స్పందించారు. లక్ష్మణ్‌ తన స్థాయిని మరచి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్​పై భాజపా నేతలు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారికి గజినీ, ఘోరీలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం.. కేంద్రం పెద్దల కాళ్లను కేటీఆర్ పట్టుకుంటే తప్పేమిటని నిలదీశారు. లక్ష్మణ్ తన ఉనికిని చాటుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భాను ప్రసాద్​ దుయ్యబట్టారు. లక్ష్మణ్​ ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని హితవు పలికారు.

లక్ష్మణ్​తో ఏ విషయంలోనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అందుకు కేటీఆర్​ అవసరం లేదన్నారు. సమయం, వేదిక వారే ప్రకటించాలని సవాల్ విసిరారు. భాజపా నేతలకు దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి వారి బలాన్ని పెంచుకుంటే మంచిదన్నారు.

'కేటీఆర్​ కాళ్లు పట్టుకుంటే.. మీకే సిగ్గుచేటు'

ఇవీచూడండి: 'మేడారాన్ని గుర్తించాలి, రాష్ట్రానికి విద్యాలయాలు రావాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.