తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిప్పికొట్టారు. మోదీని కేసీఆర్ కలవడంపై రేవంత్ రెడ్డి అడ్డమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని లిల్లీఫుట్ అని విమర్శించారు. రాజకీయ పరిపక్వత లేని ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల గురించి మోదీని కలిస్తే అందులో మంచి ఎలా కనిపిస్తుందని దుయ్యబట్టారు. చైనా రాయబారిని చాలా సార్లు కలిసిన రాహుల్ గాంధీ ఏమైనా దేశద్రోహానికి పాల్పడ్డారా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించి పోయారని... ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దిల్లీలో వారం రోజులు ఉంటే ప్రతిపక్షాలకు నిద్రపట్టలేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి భాజపాను దీటుగా ఎదుర్కొవాలన్నారు. లేదంటే రేవంత్ రెడ్డి స్వయంగా పోటీ చేయాలన్నారు. బండి సంజయ్‌కు సీఎంను తిట్టడం తప్ప వేరే ప్రణాళికే లేదని తెలిపారు.
సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన విధానం చూస్తే రేవంత్‌కు రేబిస్ వ్యాధి సోకినట్లు అనిపిస్తుంది. రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముందు రేవంత్ లిల్లీఫుట్. రాజ్యాంగ బద్ధంగా ఒక ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కలవడం ఆనవాయితీ.
-జీవన్ రెడ్డి, పీయూసీ ఛైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే
ఇదీ చదవండి: Maoist surrender: 53 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు