ETV Bharat / city

'ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం వివక్ష కాదా ? '

author img

By

Published : Feb 9, 2022, 12:10 PM IST

trs protest on bjp: మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ తెరాస నిరసన తెెరాస నాయకులు ఆందోళనలు చేసస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్​పల్లి కూడలి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను అప్పనంగా తీసుకొని ఆంధ్రలో కలపడం వివక్ష కాదా అని బోయిన్​పల్లి డివిజన్ కార్పొరేటర్ ప్రశ్నించారు.

trs protest on bjp
భాజపాకు వ్యతిరేకంగా తెరాస నిరసన

trs protest on bjp: సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్​పల్లి కూడలి వద్ద రాజ్యసభలో తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మూసాపేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో అనేక వివాదాలు తలెతాయని ఇతర సమస్యలు లేవని ప్రధాని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

'ప్రధాని మోదీ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని మరోసారి వెల్లడైంది. విభజన మూలంగానే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడటం దారుణం. తెలంగాణలోని ఏడు మండలాలను అప్పనంగా తీసుకొని ఆంధ్రలో కలపడం మోదీ వివక్ష చూపడానికి కారణం కాదా ? ' -ముద్దం నరసింహ యాదవ్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్

ఇదీ చదవండి:KTR On Modi : 'తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.