హైదరాబాద్ రాజేంద్రనగర్ డివిజన్లోని ఉప్పర్పల్లి పోలింగ్స్టేషన్-24లో భాజపా నాయకులు రిగ్గింగ్ చేశారని తెరాస వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇంద్రసేనా రెడ్డి అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడని... ఆ వ్యక్తి ఓటును ఇతరులు ఎలా వేస్తారంటూ తెరాస నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలాంటివి ఎన్ని ఓట్లు వేశారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి పోలింగ్ బూత్-24లో రీపొలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేంత వరకు అందోళన చేపడుతమని తెరాస నాయకులు డిమాండ్ చేశారు.