ETV Bharat / city

హోరాహోరీ పోరులో.. తెరాస ప్రచార జోరు - పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస జోరుగా ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెరాస దూకుడు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో విపక్షాల కంటే జోరుగా ప్రచారం చేస్తోంది. ప్రశ్నించే గొంతును కాకుండా... సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న వారిని మండలికి పంపాలన్న నినాదంతో నేతలు ఓట్ల వేట సాగిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

graduate mlc elections in telangana
హోరాహోరీ పోరులో.. తెరాస ప్రచార జోరు
author img

By

Published : Mar 7, 2021, 7:33 AM IST

హోరాహోరీ పోరులో.. తెరాస ప్రచార జోరు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఓట్ల వేటలో తెరాస నేతలు జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ... పట్టభద్రులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఖమ్మం, వరంగల్‌లోని పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి... కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీకి భూములు కేటాయించినా.. దానిని ఉత్తరప్రదేశ్‌కు కేటాయించారని అన్నారు.

చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు..

సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పద్మారావు గౌడ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్​టీవో ఉద్యోగుల మధ్య కొంత మంది చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. హైదరాబాద్‌ నాంపల్లి టీఎన్​జీవో భవన్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి గంగుల పాల్గొన్నారు.

లక్షా 30 వేల ఉద్యోగాలు..

తెరాస అధికారంలోకి వచ్చాక లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించిందని... ఎన్నికల అనంతరం మరిన్ని కొలువుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని వరంగల్‌-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మేడారం జాతరకు జాతీయ హోదా..

ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకువచ్చి భాజపా నేతలు తెలంగాణ మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సత్యవతి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. తెరాస ఎన్​ఆర్​ఐ శాఖల ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత... రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఇవీచూడండి: 'నేనెప్పుడూ నామినేటెడ్‌ పోస్టులు కోరుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.