ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య గురువారం జరిగిన రెండో సెమీఫైనల్(second semi final) మ్యాచ్‌ను సానియా మీర్జా స్టేడియంలో వీక్షించింది. ఒకానొక సమయంలో ఆమె చప్పట్లు కొడుతూ పాక్ ఆటగాళ్లను ప్రోత్సహించడం.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పాకిస్థాన్ జట్టుకు సానియా మద్దతు తెలపడంపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్(trolls on Sania Mirza) చేస్తున్నారు. భారత్ తరఫున టెన్నిస్ ఆడుతూ పాకిస్థాన్ జట్టును అభినందించడమేంటని భారత క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆ క్యాచ్ పట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేది'