ETV Bharat / city

ఏపీ రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ..! - Amaravati Cases News

ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మల్వబాగ్చి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధానిపై దాఖలైన వాజ్యాలను విచారించనుంది. రాజధాని వ్యాజ్యాల్ని విచారించాలని కోరుతూ...ఏపీ ఏజీ హైకోర్టుకు లేఖ రాసినట్లు సమాచారం.

ap high court
ఏపీ రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ..!
author img

By

Published : Mar 21, 2021, 9:15 AM IST

ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈనెల 26న మధ్యాహ్నం 2.15 గంటలకు రాజధానిపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరపనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మల్వబాగ్చి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాజ్యాలను విచారించనుంది. అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.

జస్టిస్ మహేశ్వరీ బదిలీతో ఆ వ్యాజ్యాలపై విచారణ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు విడుదల చేసిన రోస్టర్ ప్రకారం... ఈ నెల 26న త్రిసభ్య ధర్మాసనం విచారణకు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని వ్యాజ్యాల్ని విచారించాలని కోరుతూ.. హైకోర్టుకు ఏజీ లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు హైకోర్టు సీజే రోస్టర్​లో మార్పులు చేయడం వల్ల.. న్యాయమూర్తులు విచారించే వ్యాజ్యాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇవీచూడండి: చతికిలపడిన భాజపా, కాంగ్రెస్... గట్టిపోటీనిచ్చిన తీన్మార్​ మల్లన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.