అక్షరాన్ని ఆయుధంగా మలచిన వ్యక్తి అంబేడ్కర్ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి.. జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహనీయుడని కొనియాడారు. డా.బీఆర్ అంబేడ్కర్ వర్దంతి వేడుకలను దళిత సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.
దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. దళితులు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని చెన్నయ్య అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని.. అంబేడ్కర్ ఆశయ సాధన మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ఇదీ చూడండి: కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం