ఆర్టీసీ సమ్మెతో... సామాన్యుల కష్టాలు రెట్టంపయ్యాయి. నెల రోజులు గడిచినా పరిస్థితులు మారకపోవడం వల్ల ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు గమ్యస్థానాలు చేరేందుకు నానాపాట్లు పడుతున్నారు. సరిపడ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
గాలిలో తేలుతూ పోవచ్చు..!
ఉన్న కొద్దిపాటి బస్సుల్లో ఇరుగ్గా ప్రయాణిస్తూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సొంత వాహనాలు లేక, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించలేక ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారు. దిల్షుక్ నగర్ నుంచి హయత్ నగర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, డోర్లకు వేలాడుతో ప్రయణిస్తున్నారు. ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినప్పటికి ఈ తంతు కొనసాగుతోంది. అమ్మాయిలకు సైతం ఈ ఫీట్లు తప్పడం లేదు. ప్రభుత్వం సరిపడా బస్సులు నడుపుతోందని చెబుతున్నా... ఈ దృశ్యాలు ప్రయాణికుల కష్టాలకు అద్దం పడుతున్నాయి.
ఇదీ చూడండి: గడువు ముగిసింది... తదుపరి కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష