ETV Bharat / city

డీజీపీ నేతృత్వంలో నిత్యావసర సరకుల రవాణా - essential commodities led by dgp mahendar reddy

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త వహిస్తోంది. రోజూ ఆయా సరకులను రాష్ట్రానికి రప్పించడంతో పాటు అవి గ్రామాల వరకు సరఫరా అయ్యేలా ప్రత్యేక బృందం రేయింబవళ్లు పని చేస్తోంది.

Transportation of essential commodities led by dgp mahendar reddy
డీజీపీ నేతృత్వంలో నిత్యావసర సరకుల రవాణా
author img

By

Published : Apr 10, 2020, 7:27 AM IST

మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ మొదలవడంతో నిత్యావసరాల కొరత రాకుండా ప్రభుత్వం స్పందించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పోలీసు, మార్కెటింగ్‌, రవాణా, పౌరసరఫరాలు తదితర శాఖల అధికారులుంటారు. దీని పర్యవేక్షణ కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు చురుగ్గా వ్యవహరించడంతో వేలాది టన్నుల నిత్యావసరాలు ఆటంకం లేకుండా రాష్ట్రానికి చేరుతున్నాయి. రాష్ట్రంలో 1.72 లక్షల సరకు రవాణా లారీలుండగా, యజమానులతో మాట్లాడి వాటిని వినియోగిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం

మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడుల నుంచి నిత్యావసరాలు తీసుకొస్తూ నిలిచిపోయిన లారీలను ఆయా రాష్ట్ర అధికారుల అనుమతితో తెలంగాణకు రప్పించారు. నిత్యావసరాలు, అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలకు ప్రత్యేకంగా ఒక పోస్టర్‌ను రూపొందించారు. ఈ పోస్టర్‌ అతికిస్తే... లారీలను ఎవరూ ఆపకుండా పంపించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గోదాములకు చేరిన సరకుల్లో రోజూ ఏ జిల్లాకు ఎంత వెళ్లాయి. ఎక్కడ ఎన్ని నిల్వలున్నాయని రోజూ స్పెషల్‌ బ్రాంచి పోలీసులు ఆరా తీసి నివేదిక ఇస్తున్నారు. ఇలా సరకు నల్లబజారుకు తరలిపోకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.

* రాష్ట్రంలోని వంట నూనెల తయారీ కంపెనీలకు ముడిపదార్థం గుజరాత్‌ నుంచి ఏపీలోని కృష్ణపట్నం పోర్టుకు వస్తుంది. ఏపీ అధికారులతో మాట్లాడి ముడి పదార్థాలు నిరంతరం నేరుగా తయారీదారులకే చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తయారైన వంటనూనెలు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు.

* విప్రో లాంటి పెద్ద కంపెనీలతో మాట్లాడి వారి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకున్నారు.

* రాష్ట్రంలో నిత్యం రూ. ఆరు కోట్ల విలువైన కోడి మాంసం రవాణా జరుగుతుంది. లాక్‌డౌన్‌ విధించిన తొలి రోజుల్లో రవాణా ఆగిపోవడంతో వెంటనే ఆటంకాలు తొలగించారు. రోజూ 55 వేల లీటర్ల పాల సరఫరాకు కూడా మార్గం సుగమం చేశారు.

ఔషధాల తయారీకి సహకారం

కరోనా నిరోధ చికిత్సలో వినియోగించే మందులు, ఇతర ఔషధాలను రాష్ట్రంలో తయారు చేసే 250 కంపెనీలకు ముడిసరకు రవాణా ఆగిపోగా, సరఫరాదారులు, డీలర్లతో ఉన్నతాధికారులు చర్చించి పరిష్కరించారు. ఇదే సమయంలో కార్మికుల కొరత ఏర్పడితే నిర్మాణ రంగ ప్రతినిధులతో మాట్లాడి కార్మికులను అక్కడికి పంపించారు. తయారైన మందుల నిల్వకు కోల్డ్​ స్టోరేజీ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు. సరకుల కొరత లేకుండా తమ బృందం శ్రద్ధ వహిస్తోందని డీఐజీ సుమతి ‘ఈనాడు’కు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.