హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం కత్తితో వివాహమాడి జోగినిగా మారింది. అనంతరం ఆమె మెడలో గురువు మూడుముళ్లు వేశాడు. మామిడి, నేరేడు, వేప ఆకులతో వేసిన మండపంలో సంప్రదాయబద్దంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
తొలుత పండితుడి సూచనల మేరకు ప్రశాంతి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, నర్సింహులు ‘ఎల్లమ్మ మునిరాజు జోగుకల్యాణం’గా వ్యవహరించే వివాహ క్రతువు నిర్వహించారు. అనంతరం గురువు భూపేశ్‌నగర్ జగన్ యాదవ్ (మేఘన) ప్రశాంతి మెడలో మూడుముళ్లు వేశాడు. అంతకు ముందు ఉంగరాలు మార్చుకోవడం, తలపై జీలకర్ర-బెల్లం ఉంచడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మరికొంతమంది ట్రాన్స్‌జెండర్ల మెడలోనూ గురువు మూడుముళ్లు వేశాడు. అమ్మవారి సేవలో జీవితాన్ని అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వధువు ప్రశాంతి తెలిపింది. వివాహ వేడుక అనంతరం బంధుమిత్రులకు విందుభోజనం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌జెండర్లు హాజరయ్యారు.
ఇదీచూడండి: పెళ్లయ్యాక భార్య.. మహిళ కాదని తెలిస్తే..