సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. రోజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని విదేశీ ప్రతినిధులు సందర్శించారు. బ్రిటన్కు చెందిన శ్రీమతి చార్లెట్, రస్సెల్ గార్డ్ అనే ఇరువురు సామాజిక కార్యకర్తలు విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
భవిష్యత్తులో యువత నిరుద్యోగ స్థితి ఎదుర్కోకుండా.. స్వయం ఉపాధి కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని చార్లెట్ తెలిపారు. రోజ్ సంస్థ ఇస్నాపూర్ పాఠశాలను దత్తత తీసుకుని హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల దీన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.