ETV Bharat / city

వైద్యం కోసం నిరీక్షించి.. కుప్పకూలి మృతి - A Patient Died in Hospital due Waiting for medical treatment News Today

ఏపీలోని కడప సర్వజన ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. నగర శివారులోని రామరాజుపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి చికిత్స కోసం రాత్రి సర్వజన ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పడకలు లేవు.. ఖాళీ అయితేకానీ ఇవ్వలేమని అక్కడి సిబ్బంది చెప్పారు. బెడ్ కోసం వేచిచూస్తుండగానే బాధితుడు కుప్పకూలిపోయారు. చికిత్స అందించమని వైద్యులకు ఎంత విన్నవించినా పెడ చెవిన పెట్టారు. ఫలితంగా రోగి తుది శ్వాస విడిచారు.

corona patient died of no beds in kadapa
కడపలో పడకలు లేక కరోనా రోగి మృతి
author img

By

Published : May 13, 2021, 1:12 PM IST

వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చినా.. చికిత్స అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. కొవిడ్‌ బారిన పడిన కడప నగర శివారులోని రామరాజుపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి వైద్యం కోసం బుధవారం రాత్రి సర్వజన ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పడకలు లేవు.. ఖాళీ అయితేకానీ ఇవ్వలేమని అక్కడి సిబ్బంది బదులిచ్చారు.

కుటుంబీకులు సీపీఆర్ చేసినా..

గంట సేపు ఆస్పత్రి వద్దే నిలబడి నిరీక్షించిన శంకర్‌ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గుండెలపై ఒత్తుతూ సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఎంత బతిమాలినా పట్టించుకోలేదు..

‘మా నాన్న తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు.. ప్రాథమిక చికిత్స అయినా చేయండి, అక్కడే ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా ప్రాణవాయువు అందివ్వండని ఎంత బతిమాలినా ఒక్కరూ పట్టించుకోలేదు’ అని మృతుడి కుమారుడు రామశంకర్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు పక్కనే ఉన్నా, నిర్లక్ష్యం చేసి నిండు ప్రాణాన్ని బలి గొన్నారని అల్లుడు సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.