ETV Bharat / city

కిసాన్‌ అధికార్‌ దివాస్​ను విజయవంతం చేయండి: ఉత్తమ్​కుమార్​

author img

By

Published : Oct 30, 2020, 10:10 PM IST

Updated : Oct 31, 2020, 5:17 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కిసాన్​ అధికార్​ దివాస్​ను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, కేంద్రంలో పధాని నరేంద్ర మోదీ చేపట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ నాయకులు ప్రసంగించాలని పేర్కొన్నారు.

tpcc uttamkumar reddy on kisan diwas
tpcc uttamkumar reddy on kisan diwas

ఏఐసీసీ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా "కిసాన్‌ అధికార్‌ దివాస్‌'' కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 31న కేంద్ర మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కిసాన్ అధికార్ దివాస్ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు సూచించారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన రైతు ఉద్యమాలను, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన హరిత విప్లవం, దేశంలో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ నాయకులు ప్రసంగాలు చేయాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు.

పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, కేంద్రంలో పధాని నరేంద్ర మోదీ చేపట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ నాయకులు ప్రసంగించాలని పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో చేపడుతున్న కిసాన్‌ అధికార్‌ దివస్‌ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో డీసీసీ అధ్యక్షులు విజయవంతం చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా సంక్షోభంతో ప్రమాదంలో క్రెడిట్‌ కార్డు రుణాలు: ఆర్బీఐ

Last Updated : Oct 31, 2020, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.