Revanth reddy Comments: రాష్ట్రంలో 24 గంటల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లు కొనటం ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగనాటకాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. రైతుల నుంచి చివరి వరిగింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పక్షాన పోరాటం చేసి.. వారికి అండగా ఉంటామని రేవంత్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని రైతులకు భరోసా కల్పించాలన్నారు. లేకపోతే.. రైతులందరిని కూడగట్టి ఎక్కడికక్కడ మంత్రులు, తెరాస నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Cabinet Meeting: వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్ణయం ప్రకటించనుంది. ధాన్యం కొనుగోళ్ల అంశమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గడువు ఈ మధ్యాహ్నంతో తీరనుంది. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి.. ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.
-
కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి….
లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.
">కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2022
24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి….
లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్ల పై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి.
— Revanth Reddy (@revanth_anumula) April 12, 2022
24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి….
లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.
ఇదీ చూడండి: