ETV Bharat / city

ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణ 6 టీఎంసీలు నష్టపోతుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తికి చుక్క నీరు రాదన్నారు.

uttam
uttam
author img

By

Published : Aug 1, 2020, 6:48 PM IST

Updated : Aug 1, 2020, 6:55 PM IST

పోతిరెడ్డిపాడు అంశంలో సీఎం కేసీఆర్ సరైన రీతిలో స్పందించట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. 44వేల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... వల్ల తెలంగాణ నష్టపోతోందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తెచ్చుకోకపోతే... సీఎం కేసీఆర్‌ అసమర్థతే కారణమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఈనెల 11న ఏపీ పోతిరెడ్డిపాడుకు టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం ఉందన్నారు. టెండర్లు పూర్తికావాలనే కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయాలన్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్

ఇదీ చదవండి: భాజపాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు: కేటీఆర్

Last Updated : Aug 1, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.