ETV Bharat / city

'రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు' - ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు

రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : Feb 16, 2021, 1:55 PM IST

కాంగ్రెస్‌ సామాజిక న్యాయం కోరుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ‌కుమార్ రెడ్డి అన్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్‌ పార్టీయే ఇస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్‌లను తగ్గించిన తెరాసకు బుద్ధి చెప్పాలని సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మెన్‌ ఛైర్మన్‌గా మెట్టు సాయి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు.

రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ఉత్తమ్​ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తెరాస, భాజపాకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పిన మోదీ... ఇప్పుడు పెట్రోల్ ధరలను వంద రూపాయలకు పెంచారని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, నగేశ్, డీసీసీ అద్యక్షులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.