ETV Bharat / city

'భాజపా, ఎంఐఎంకు ఓ న్యాయం.. మిగతా వాళ్లకో న్యాయమా?'

ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు కర్రలతో భారీ కవాతు నిర్వహిస్తామంటే బేషరతుగా అనుమతి ఇచ్చారు. నిజామాబాద్‌లో ముస్లింల భారీ ర్యాలీకి అనుమతి ఇచ్చారు. మేం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. - ఉత్తమ్​కుమార్ రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు

ఉత్తమ్​కుమార్ రెడ్డి,
ఉత్తమ్​కుమార్ రెడ్డి,
author img

By

Published : Dec 27, 2019, 4:21 PM IST

భాజపా, ఎంఐఎంతో తెరాసకు మంచి అవగాహన ఉందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎస్ఎస్‌ వాళ్లు కవాతు పేరుతో కర్రలతో భయానక వాతావరణం సృష్టించారన్నారు.

భాజపా, ఎంఐఎంలకు ఇచ్చిన అనుమతి కాంగ్రెస్​కు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ఇతర పక్షాలు చిన్నసభలు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆక్షేపించారు. తాము అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు.

రేపు కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నేతలు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ జరిపి 11 గంటలకు గాంధీ భవన్‌ చేరుకోవాలని పిలుపునిచ్చారు.

New Delhi, 27 December (ANI): Special Cell of Delhi Police busted a network of fake Indian currency note by arresting 5 accused. For the past few months, special cell of Delhi Police received information through reliable sources of a racket which is involved in the printing and circulation of the fake Indian currency note in North-East district of Delhi. On this information, special cell launched a deep deployment operation. Soon, it emerged that this racket of FICN is being operated by some youth, who have been working under the direction of a person who is setup this network in Delhi. To develop the emerging contours of this highly secretive racket, seasoned sources were deployed and intensive surveillance was also mounted. The efforts yielded result and Delhi police received specific information that a delivery of FICN would take place at a location in Laxmi Nagar, Delhi. Police laid a trap in that area and apprehended three persons, who included suppliers and receiver of FICN. During further investigation, at the instance of accused, two more accused were arrested by Delhi police. Approx a total FICN of Rs. 3 lakh was recovered from the arrested persons.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.