ETV Bharat / city

ఖాళీ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిర్మించాలి: ఉత్తమ్ - ఉస్మానియా ఆసుపత్రి సందర్శించిన కాంగ్రెస్ నేతలు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి... సూపరింటెండెంట్​ను అడిగి తెలుసుకున్నారు.

tpcc president utham kumar reddy and leaders visit osmania hospital buildings
ఖాళీ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిర్మించాలి: ఉత్తమ్
author img

By

Published : Jul 25, 2020, 4:51 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం... ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్​ను కలిసి... ఆసుపత్రి తరలింపు, కూల్చివేత, వైద్యులు, సిబ్బంది కొరత వంటి సమస్యల గురించి తెలుసుకున్నారు. నిజాం కట్టిన భవనాలను కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చారిత్రక భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఆసుపత్రి ఆవరణలో ఖాళీగా ఉన్న 6 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.

మూడు నాలుగు సంవత్సరాలుగా 5 వందల కోట్ల బడ్జెట్​తో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాల ప్రణాళిక ఉందని సూపరింటెండెంట్ చెప్పినట్టు ఉత్తమ్ తెలిపారు. కరోనా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఉత్తమ్... ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి పెరుగుతోందని ఆరోపించారు. ఉత్తమ్ వెంట కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్​ ఖాన్​, అనిల్​ కుమార్ యాదవ్​ తదితరులు ఉన్నారు.

ఖాళీ స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిర్మించాలి: ఉత్తమ్

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.