లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ కార్వాన్‌లోని పేదలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్వాన్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఖాద్రీ నివాసం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఉత్తమ్ సూచించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మొత్తం 1009... ఇవాళ కొత్తగా 6 కరోనా కేసులు