దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీయే కొనసాగాలని కోరుతూ తెలంగాణ నేతలంతా ఏకవాక్య తీర్మానం చేశామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ తెలిపారు. మతతత్వ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఈ సమయంలో దేశాన్ని కాపాడగలిగే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీయేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
- ఇదీ చూడండి : జాగ్వార్ కొనలేదని బీఎండబ్ల్యూను కాల్వలో పడేశాడు!