హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలు, హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓటమి తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాస రావు సమావేశానికి హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావం, పరిశ్రమలు క్రమంగా మూత పడుతుండటం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం లాంటి అంశాలను వివరించనున్నారు. కేంద్రంలో భాజపా పరిపాలనపై విశ్లేషిస్తున్నారు.