బంజారాహిల్స్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధనరాజ్ రాథోడ్‌ను గెలిపిస్తే ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎంబీటీ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉత్తమ్... స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో నష్టపోయిన బాధిత కుటుంబాలకు 50వేల రూపాయలు అందజేస్తామని వాగ్దానం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగమని చెప్పిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఇవీ చూడండి: గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్